click on each below page!

November 26, 2013

my poetry


              ప్రకృతి పిల్చిన వేళ
కష్టమనే పెద్ద సాహసాన్ని, ఇష్టమనే
నిష్టతో చేసే చిన్ని చీమ వివరించదా?


భూగోళంపై విస్తరించిన వృక్ష సంపద
నేర్పెను చేయకని ఏ ఆపద
సంధ్యవేళ ఎగిరే పక్షుల గుంపు
నీలో ఎనలేని ఐక్యతను పెంపు
చిని చిని పుల్లలతో పేర్చిన గూళ్ళు
ఎన్నెన్నేళ్లైన చెరగని కట్టడాలు
సెలయేటి స్వరాలు, కోయిల కోమల ధ్వనులు
సంగీత వాద్యాలు,మనసును మెప్పించే మధుర గీతాలు
పక్షి తన ఆకృతి, నేర్పెను ఎగిరె జాగృతి
ఉదయించే సూర్యుడు, తెలియని బాల వయసు
అస్తమించే భానుడు ముగిసిన నీ వయసు
రవి చిరంజీవి నీవు అల్పజీవి
నేను చూపించిన ఇంత ఙానం
సాటి రాదు ఏ వింత అంతర్జాలం
భూమాత వస్త్రాన్ని మండించు 'మానవా ' ?
నా హృదయాగ్నిని చల్లార్చే నీ
చల్లని రక్త మార్గాల్ని నాలో ప్రవహించు
సువిశాల సస్యశామల సామ్రాజ్యాన్ని,
నీ జీవన ఊహామార్గాలకు ప్రాణం నేనిస్తా !
---by విజయ్ కుమార్